హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో సోమవారం భారీ వర్షాలకు కొండ చరియలు విరిగి పడడంతో ఓ శివాలయం కూలింది. ఈ దుర్ఘటనలో 9 మంది చనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రార్థనలు చేసేందుకు శివాలయానికి 50 మంది వరకు వచ్చారు. ఈ క్రమంలో కొండ చరియలు విరిగిపడడంతో వారంతా శిథిలాల కింద చిక్కుకున్నారు. పోలీసులు, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa