నేను చాలా ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నా..రెండు సార్లు ఎమ్మెల్యేగా అయ్యాను. కానీ లోకేశ్ వాళ్ల నాన్న ముఖ్యమంత్రిగా ఉండగానే, ఒక మంత్రిగా ఉండగానే ఓడిపోయాడు అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అయన మాట్లాడుతూ..... సినిమాల్లో కమెడియన్స్, సర్కస్లో బఫూన్లు ఉన్నట్లే రాజకీయాల్లోనూ బఫూన్లు ఉంటారు. రాజకీయాల్లో బఫూన్ నారా లోకేశ్. తెలుగు మాట్లాడటమే రాదు. డెంగ్యూ అనమంటే బూతులు మాట్లాడతాడు.. ప్రశాంతతను కూడా ప్రశాంతి అత్తను చేశాడు. బీసీల సమావేశంలో బీసీ సోదరులకు బదులు బీసీ చౌదరులు అంటాడు. వైశ్యులను వైశాలి అంటున్నాడు. మొన్న మాచర్లకు వెళ్లి మాచల్ల అంటాడు. పొట్టకోస్తే అక్షరం ముక్కలేదు..మాట్లాడం కుదరదు..తెలుగు మాట్లాడటం అసలు కుదరదు. అలాంటి వ్యక్తి నన్ను విమర్శిస్తున్నాడు. దిగజారి విమర్శలు చేస్తున్నాడు అని దుయ్యబట్టారు.