రుషికొండపై నిర్మాణాలకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చిందని, నిర్మాణాలు ఆపేయాలని కోర్టు ఎక్కడా చెప్పలేదని మంత్రి రోజా తెలిపారు. కోర్టుకంటే పవన్ కల్యాణ్ గొప్పవాడా..? అని ప్రశ్నించారు. రుషికొండపై ఏం అక్రమాలు జరిగాయో పవన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈ కేసు హైకోర్టులో ఉందని, ప్రభుత్వం చేసే ప్రతి డెవలప్మెంట్ ఎప్పటికప్పుడు అఫిడవిట్ రూపంలో అందిస్తున్నామని, కోర్టు మార్పులు చెబితే అవి ప్రభుత్వం చేస్తుంది.. పవన్‌కు మధ్యలో బాధేంటి..? అని ప్రశ్నించారు. పవన్ కళ్లు కల్యాణ్ జ్యువెలరీలో తాకట్టుపెట్టాడా..? దత్తతండ్రి చంద్రబాబు 33 వేల ఎకరాలు తీసుకుంటే నోట్లో హెరిటేజ్ ఐస్‌క్రీమ్ పెట్టుకున్నాడా..? అని ప్రశ్నించారు.