చంద్రబాబు నాయకత్వంలో పని చేస్తున్న లోకేశ్, దత్తపుత్రుడు ఒక ఆర్కెస్ట్రాల శబ్ద కాలుష్యం చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తమకు ఏ చట్టం వర్తించదు అన్నట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. విశాఖలో పవన్ కళ్యాణ్ కారు కూతలు కూస్తున్నారన్నారు. ఎందుకు అంత ఆవేశపడుతున్నారని ప్రశ్నించారు. రజనీకాంత్, చిరంజీవి మాట్లాడిన అభిమానుల కేరింతలు వస్తాయని.. పవన్ కళ్యాణ్ ఎందుకు ఆవేశ పడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. పవన్ కళ్యాణ్ యజమాని చంద్రబాబు అంటూ విమర్శలు గుప్పించారు. అంగళ్లులో పోలీసుల కాల్పులు జరగాలని చంద్రబాబు కోరుకున్నారని తెలిపారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సీబీఐ రాష్ట్రంలోకి రావడానికి వీలు లేదన్నారని.. ఇప్పుడు సీబీఐ విచారణ కావాలని అడుగుతున్నారని అన్నారు. అధికారం నా హక్కు, నేనే అర్హుడిని అని చంద్రబాబు అనుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారన్నారు. పవన్‌కు తాను గెలవాలని లేదని.. చంద్రబాబును గెలిపించాలని తప్ప అని విమర్శించారు. పవన్ కళ్యాణ్‌ను ఓడించింది కూడా గాజువాక ప్రజలే అని చెప్పుకొచ్చారు. రిషికొండలో చట్టాలు ఉల్లంఘించి నిర్మాణాలు సాధ్యం కాదన్నారు. రిషికొండలో ఉల్లంఘనలు చేసి నిర్మాణాలు చేస్తే జగన్మోహన్ రెడ్డికి ఏం వస్తుందని అడిగారు. ఉండవల్లి శ్రీదేవిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన రోజు నుంచే ఆమెతో తమకు బంధం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.