రాష్ట్ర ప్రభుత్వ వేధింపులపై ఆడిటర్లు టీడీపీ యువనేత నారా లోకేశ్ ముందు తమ ఆవేదనను వెలిబుచ్చారు. సోమవారం యువగళం పాదయాత్రలో భాగంగా తాడికొండ వద్ద ఆడిటర్లతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్బంగా లోకేశ్ ముందు ఆడిటర్లు తమ బాధను చెప్పుకొచ్చారు. సీఐడీ ద్వారా ప్రభుత్వ వేధింపులను లోకేష్ దృష్టికి ఆడిటర్లు తీసుకొచ్చారు. చార్టెడ్ అకౌంటెంట్లపై ప్రభుత్వం కేసులు పెడుతోందన్నారు. సీఐడీ ద్వారా కేసులు పెట్టి వేధిస్తున్నారని తెలిపారు. ఆడిటర్లకు, చార్టెడ్ అకౌంటెంట్లకు సంబంధం లేని వ్యవహారాల్లో కేసులు పెట్టారన్నారు. రాజకీయ కక్షలతో అరెస్టులు చేశారని చెప్పారు. అరెస్టు విషయంలో కనీస నిబంధనలు పాటించలేదని ఆడిటర్లు తెలిపారు.