టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హర్యానా పర్యటనలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకొంది. ఈ పర్యటనలోనున్న నారా చంద్రబాబు నాయుడు దంపతులు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయను కలిశారు. హర్యానా రాజ్ భవన్‌లో మర్యాదపూర్వకంగా చంద్రబాబు, భువనేశ్వరి కలిశారు. వ్యక్తిగత పర్యటన మీద చంద్రబాబు కుటుంబ సభ్యులు మూడురోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 11న చండీగఢ్ వెళ్లారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa