ఇటివలే కన్నుమూసిన గద్దర్‌ను భయం అంటే ఏంటో తెలియని వ్యక్తిగా టీడీపీ అధినేత చంద్రబాబు అభివర్ణించారు. మంగళవారం గద్దర్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1997లో గద్దర్‌పై కాల్పులు జరిగిన ఘటనపై స్పందించారు. కాల్పుల ఘటనకు సంబంధించి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కాల్పుల ఘటన తర్వాత గద్దర్.. తనతో అనేక సార్లు మాట్లాడారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa