శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పట్టణ పరిధి సడ్లపల్లిలోని ఓ ఇంట్లో ఆదివారం అర్ధరాత్రి ఎలక్ర్టిక్ బైక్ పేలింది. ఈ ప్రమాదంలో ఒకరు గాయపడ్డారు. మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ నారాయణరెడ్డి ఇంట్లో ఈ ఘటన జరిగింది. పేలుడు సమయంలో ఇంట్లో నారాయణ రెడ్డి భార్య, ఆమె కుమారుడు బాలాజీరెడ్డి వేర్వేరు గదుల్లో నిద్రిస్తున్నారు. ఇంట్లోని హాలులో ఓ మూలన బైక్ పెట్టారు. బ్యాటరీ చార్జింగ్ కూడా పెట్టలేదు. అయినప్పటికీ పేలుడు సంభవించడంతో, బైక్ మంటల్లో చిక్కుకుంది. ఇంట్లోని టీవీ, ఇతరత్రా సామగ్రికి మంటలంటుకుని కాలిపోయాయి. ఆర్పే ప్రయత్నంలో బాలాజీరెడ్డి గాయపడ్డారు. టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa