ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ కళ్యాణ్ ను కాపు జాతి క్షమించదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 15, 2023, 09:57 PM

చంద్రబాబును సీఎం చేయడానికి పవన్ కల్యాణ్ పడుతున్న తపనను కాపు జాతి క్షమించదని వైసీపీ మహిళా ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. స్త్రీల పుట్టుకనే చంద్రబాబు అవమానించారని, అలాంటి వ్యక్తితో పవన్ కల్యాణ్ అంటకాగుతున్నారని మండిపడ్డారు. ఇవాళ జనసేన వీరమహిళలతో పవన్ కల్యాణ్ సమావేశమైన నేపథ్యంలో, పోతుల సునీత స్పందించారు. మహిళల గురించి మాట్లాడే అర్హత పవన్ కల్యాణ్ కు ఉందా? అని నిలదీశారు. పవన్ తన భార్యలకు ఎలాంటి గౌరవం ఇచ్చాడో రాష్ట్ర ప్రజలకు తెలుసని ఎద్దేవా చేశారు. ప్రజాకోర్టులో శిక్షిస్తానని పవన్ కల్యాణ్ చెబుతున్నాడని, అసలు ప్రజాకోర్టు అంటే ఏమిటో పవన్ కల్యాణ్ కు తెలుసా? అని పోతుల సునీత ప్రశ్నించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com