శ్రీసత్యసాయి జిల్లాలో వేరుసెనగ విత్తనం గొంతులో ఇరుక్కుని రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. కర్ణాటకకు చెందిన హనుమంతు కుటుంబం నల్లచెరువులోని బంధువుల ఇంటికి వచ్చారు. హనుమంతు రెండేళ్ల కుమార్తె నయనశ్రీ ఆడుకుంటూ వేరుసెనగ విత్తనాన్ని తినేందుకు నోట్లో పెట్టుకుంది. అది గొంతులో ఇరుక్కుని ఊపిరాడక విలవిల్లాడింది. దీంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.