పేకాట వస్తావురాలపై మంగళవారం రాత్రి పోలీసు దాడులు నిర్వహించారు. మణుగూరులో డిఎస్పి రాఘవేంద్రరావు ఆదేశాల మేరకు సీఐ బాలాజీ వరప్రసాద్ ఆధ్వర్యంలో పేకాట స్థావరాలపై ఎస్సై శ్రీనివాస్ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఏడుగురు వ్యక్తులతో పాటు వారి వద్ద నుండి 7000 నగదు, ఏడు సెల్ ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.