స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మంగళవారం ప్రొద్దుటూరు స్థానిక పుట్టపర్తి సర్కిల్లో వంద అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఆవిష్కరించారు. మహనీయులను స్మరించుకోవాల్సిన బాధ్యత భావితరాలపై ఉందని, వారి త్యాగఫలమే స్వాతంత్రమన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, కమీషనర్ వెంకటరమణయ్య, వైస్ చైర్మన్ బంగారు మునిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.