ధర్మవరం ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో తిప్పే నాయక్ ఆధ్వర్యంలో బుధవారం ప్రభుత్వ రాజకీయ గుర్తింపు పొందిన పార్టీల తరపున హాజరైన నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ఇంటింటా సర్వేలో ఇప్పటివరకు వచ్చిన ప్రగతి వివరాలను వారికి తెలియజేశారు. నియోజకవర్గంలో 73 శాతం ఇంటింటా ఓటు సర్వే పూర్తి కావడం జరిగిందన్నారు. అదేవిధంగా 1, 71, 228 మంది ఓటర్ల విచారణ పూర్తి చేశామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa