జూన్ 2023 లో బదిలీలు జరిగిన ఉపాధ్యాయులు అందరినీ ఎటువంటి షరతులు లేకుండా రిలీవ్ చేయాలని ఏపి స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం అనంతపురంలో ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయుల సర్దుబాటు చేసే సందర్భంగా ఇచ్చిన ఉత్తర్వులలో రిలీవ్ అయ్యి ప్రత్యామ్నాయం లేకుంటే మరీ అదే స్కూల్ కి డెప్యూటేషన్ మీద పనిచేయాలనడం సరైనది కాదని విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa