పులుల సంరక్షణపై అవగాహన కల్పించేందుకు విశాఖపట్నం జూ అధికారులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. అరుదైన వైట్ టైగర్ పుట్టినరోజుకు కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. పీచెస్ అనే వైట్ టైగర్‌ను విశాఖ జూ అధికారులు సంరక్షిస్తున్నారు. నాలుగేళ్ల ఈ ఆడపులి తల్లి కుమారి ఇటీవలే మరణించింది. ఆ తర్వాత సీపీఈ కాలేజ్ ఈ తెల్ల పులిని దత్తత తీసుకుని సంరక్షణ బాధ్యత చేపట్టింది.