ఆధార్ కార్డుకు అనుసంధానమైన వేలి ముద్రలను డూప్లికేట్ చేసి వారి బ్యాంక్ అకౌంట్లలోంచి నగదు కాజేస్తున్న ఐదుగురు సైబర్ నేరగాళ్లను వైఎస్సార్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ వేలిముద్రలతో కస్టమర్ సర్వీస్ పాయింట్స్‌లోని బయోమెట్రిక్ డివైస్‌లో స్కాన్ చేసి.. ఆధార్ కార్డు లింక్ చేసి ఉన్న బ్యాంక్ ఖాతాల్లోంచి నగదు కాజేస్తున్నారని పోలీసులు తెలిపారు.