నదిలో పడి ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. కోన ఆనంద్ అనే వ్యక్తి తన కార్తికేయ(11), గణేష్ గౌతమ్(7)లతోపాటు తోడల్లుడి కుమారుడు వర్షిత్‌తో కలిసి నాగావళి నది వద్దకు వెళ్లారు. అక్కడ ప్రమాదవశాత్తు ముగ్గురు పిల్లులూ నీట మునిగారు. వర్షిత్‌ను ఆనంద్ రక్షించగా.. కార్తికేయ, గౌతమ్ ప్రవాహంలో కొట్టుకుపోయారు. వారిని గుర్తించిన స్థానికులు ఆస్పత్రిగా తరలించగా.. ఇద్దరూ అక్కడ ప్రాణాలు విడిచారు.