జాతీయ ప్రతిభా ఉపకార వేతనాలు 2023 విద్యా ఏడాదికి 8వ తరగతి విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసేందుకు సెప్టెంబరు 15వ తేదీవరకు గడువుందని డీఈఓ శైలజ బుధవారం తెలిపారు. డిసెంబరు 3వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో పరీక్ష ఉంటుందన్నారు. జనరల్, బీసీ విద్యార్థులు రూ. 100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 50 వంతున పరీక్షఫీజులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. వివరాలకు bse. ap. gov. in చూడాలన్నారు.