గుంటూరు జిల్లా అథ్లెటిక్స్ జట్ల ఎంపిక ఈనెల 24న నిర్వహించనున్నట్లు కార్య దర్శి జీవీఎస్ ప్రసాద్ బుధవారం తెలిపారు. అండర్-14, 16, 18, 20 కేటగిరీల్లో గుంటూరు నగరం బిఆర్ స్టేడియంలో పోటీలు జరుగుతాయన్నారు. జిల్లా అథ్లెటిక్స్ జట్టును ఎంపిక చేసి రాష్ట్ర జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు పంపుతామన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఈనెల 23వ తేదీ లోగా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు బిఆర్ స్టేడియంలో సంప్రదించాలన్నారు.