పొన్నూరు పట్టణం 29వ వార్డు శంకరమఠం ప్రక్క వీధిలో మున్సిపల్ పబ్లిక్ కులాయి పగిలిపోయి నీరు వృధాగా పోతుంది. రెండు వారాల క్రిందటే వార్డు సచివాలయ సిబ్బందికి ఫిర్యాదు చేసిన పట్టించుకోవటం లేదని వార్డ్ ప్రజలు ఆరోపిస్తున్నారు. వారాలు తరబడి త్రాగునీరు వృధాగా పోతున్న సచివాలయ సిబ్బంది, మున్సిపల్ అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైపులైను మరమ్మత్తులు చేయాలని కోరుతున్నారు.