చక్రాయపేట మండల పరిధిలో పాపాగ్ని నది ఒడ్డున ప్రముఖ పుణ్యక్షేత్రమైన గండిలో వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో గురువారం నుండి శ్రావణ మాస ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ సహాయ కమిషనర్ అలవలపాటి ముకుంద రెడ్డి గురువారం తెలిపారు. శ్రావణమాస ఉత్సవాలకు తరలివచ్చే భక్తుల కోసం వివిధ రకాల వసతి సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.