పాకిస్తాన్, శ్రీలంక వేదికలుగా ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఆసియా కప్ 2023 టోర్నీ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 20న భారత జట్టును బీసీసీఐ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. 2018 తర్వాత తొలిసారిగా 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఈ టోర్నీ జరగనుంది. మొత్తంగా 6 జట్లు (భారత్, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్తాన్, నేపాల్) టైటిల్ కోసం తలపడనున్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ టీమ్స్ తమ జట్లను ఇప్పటికే ప్రకటించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa