జీ20 ఆరోగ్య మంత్రుల సమావేశం, ఇతర సైడ్ ఈవెంట్లో 70 మందికి పైగా విదేశీ ప్రతినిధులు పాల్గొంటున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుక్ మాండవీయ పేర్కొన్నారు. ‘‘ఈ సమావేశంలో భాగంగా వారికి ఇండియా హెల్త్ మోడల్‌ను చూపుతున్నాము. ప్రతి ఒక్కరూ దీనిపై మొగ్గు చూపుతున్నారు. ఆరోగ్య శాఖను మోదీ ప్రభుత్వం సమగ్ర దృక్పథంతో చూస్తోంది’’అని ఆయన పేర్కొన్నారు.