గంపలగూడెం మండలం పెనుగొలనులో షిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం స్వాతంత్ర్య ఉద్యమ కారుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. నిరుపేద గౌడ కుటుంబంలో జన్మించిన పాపన్న 12 వేల మంది సైన్యముతో అరాచక, నియంత్ఫత్య పాలకులైన మొగల్ సామ్రాజ్యవాద కాంక్షను అడ్డగించి రాజకీయ చైతన్యాన్ని కలిగించిన మహావీరుడని విశ్రాంత ఎంఈఓ. శేషిరెడ్డి కొనియాడారు.