అనంతపురం నగరంలోని 39వ డివిజన్ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం నిధులతో చేపడుతున్న సిమెంట్ రోడ్, డ్రైనేజీ పనులను శుక్రవారం నగర మేయర్ మహమ్మద్ వసీం పరిశీలించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మహమ్మద్ వసీం మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా నగరంలో రూ. 800 కోట్లతో అభివృద్ది కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. అలాగే అంతర్గత రహదారులు, డ్రైనేజీలు, కల్వర్టు ల అభివృద్దికి పెద్దపీట వేస్తున్నామని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa