వాహనదారులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్ లైసెన్సు, ఆర్‌సీ సర్టిఫికేట్లను ఇకపై డిజిటల్ రూపంలోనే జారీ చేస్తామని, ప్లాస్టిక్ కార్డుల జారీకి స్వస్థి పలికినట్టు వెల్లడించింది. అయితే ఇప్పటికే కార్డులకు డబ్బులు చెల్లించిన వారికి మాత్రం వాటిని పోస్ట్‌లో వారివారి ఇళ్లకు పంపిస్తామని వివరించింది. కేంద్రం ప్రవేశపెట్టిన వాహన్ పరివార్‌ను అనుసరించి ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.