విజయవాడ డివిజన్లో భద్రతా నిర్మాణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఈనెల 21 నుంచి 27 వరకు కాకినాడ-విశాఖ, విశాఖ-కాకినాడ, రాజమండ్రి-విశాఖ, విశాఖ-రాజమండ్రి రైళ్లను రద్దు చేసినట్టు వెల్లడించారు. ఈనెల 21, 22న ఎర్నాకులం -పాట్నా ఎక్స్ప్రెస్, 23, 24న బెంగళూరు గౌహతి ఎక్స్ప్రెస్, 27న కొయంబత్తూర్-సిలిచర్ ఎక్స్ప్రెస్ రైళ్లను దారి మళ్లించినట్లు తెలిపారు.