సమాజ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్న నాయకులు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అవకాశం ఉన్న అన్నిచోట్లా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు వైయస్ఆర్సీపీ పెద్ద పీట వేస్తోందని తెలిపారు. అందుకే వైయస్ఆర్ సీపీకి ఆయా వర్గాల ఆదరణ లభిస్తోందని తెలిపారు. మత్స్యకార కుటుంబం నుంచి కర్రి పద్మశ్రీ, ఎస్టీ నుంచి కుంభా రవిబాబుకు ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించారన్నారు. మొత్తం 43 ఎమ్మెల్సీ ఖాళీల్లో 18 మంది బీసీలు, 6 గురు ఎస్సీలు, నలుగురు మైనారిటీలు, ఒక ఎస్టీ అభ్యర్థికి వైయస్ జగన్ అవకాశం కల్పించారని చెప్పారు. ఈ పంథాను వైయస్ఆర్సీపీ కొనసాగిస్తుందని అన్నారు. ఎంపికైన సభ్యులు తమ వర్గాల, సమాజ అభ్యున్నతి కోసం పని చేస్తారని ఆశిస్తున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు.