చంద్రబాబు మాదిరి కపట హామీలను చెప్పి మభ్యపెట్టడం వైయస్ జగన్ మోహన్ రెడ్డికి తెలియదని, చెప్పిందే చేయడం.. చేసేదే చెప్పడం ముఖ్యమంత్రి నైజం అని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. అనంతపురం ఎమ్మెల్యే కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా విద్య, వైద్యంలో ఎన్నో విప్లవాత్మక మార్పులను తీసుకు వచ్చారన్నారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిత్యం ప్రజా సంక్షేమం కోసం ఆలోచిస్తుంటే ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఎలా ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి రావాలో ఆలోచిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి గా పని చేసినా ప్రజల కోసం చేసింది ఎం లేదన్నారు.