శ్రీసత్యసాయి జిల్లాలో పెద్ద ప్రమాదం తప్పింది. కనగానపల్లి మండలం మామిళ్లపల్లి దగ్గర కారు తొలుత డివైడర్‌ను ఢీకొట్టింది. ఆ తర్వాత రోడ్డు పక్కకు పడిపోయి.. కారులో నుంచి మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ కారులో నుంచి బయటకు దూకేశాడు. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్థమైంది. హైదరాబాద్ - బెంగళూరు హైవేపై ఈ ఘటన జరిగింది. డ్రైవర్ మంటలు చెలరేగిన వెంటనే అప్రమత్తం కావడంతో సురక్షితంగా బయటపడ్డాడు. వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు టైరకు పంక్చర్ కావడంతో వెళ్లి డివైడర్‌ను ఢీకొట్టినట్లు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరోవైపు పామిడిలో జరిగినప్రమాదంలో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పామిడి నారాయణస్వామివీధికి చెందిన వెంకటేష్ బేల్దారి పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. పని నిమిత్తం బైక్‌పై కల్లూరుకు బయల్దేరారు. మార్గమధ్యలో పెన్నా వంతెనపై అంచున బైక్ ఆపి స్టాండ్ వేయగా అది పడలేదు. వాహనంతోపాటు అతడు వంతెనపై నుంచి కింద పడ్డాడు. ఈ ఘటనలో అతడి తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.