ఆగస్టు 30న రాష్ట్రవ్యాప్తంగా 5లక్షల గృహప్రవేశాలే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తున్న కార్యక్రమంలో ధూళిపాళ్ల గ్రామం కూడా ఉందని, ఇందుకు అవసరమైన అన్ని వసతులు, వనరులు కల్పించాలని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శనివారం సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల ఇళ్ల లేఅవుట్లలోని నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్చి, రహదారుల నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.