గుత్తి మండలంలో శనివారం జరిగిన పంచాయతీ వార్డు సభ్యుల ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మండల వ్యాప్తంగా 6 గ్రామ పంచాయతీల్లో ఆరు వార్డులకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉండగా మూడు వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన మూడు వార్డు సభ్యులలో లచ్చానుపల్లి, చెర్లోపల్లి లలో వైసిపి అభ్యర్థులు టిడిపి అభ్యర్థులపై గెలుపొందగా, ధర్మాపురంలో టిడిపి అభ్యర్థి వైసిపి అభ్యర్థిపై గెలిచినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.