నందవరం మండల పరిధిలోని గురుజాల గ్రామానికి చెందిన కురువ బీరప్ప అనే కౌలు రైతు శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే తనకు ఉన్న సొంత పొలంతో పాటు పది ఎకరాలు కౌలుకు తీసుకొని పంట సాగు చేశాడు. వర్షాలు రాక తుంగభద్ర నదీలో నీరు లేక పండించే పంట పొలానికి నీరు లేక నష్టపోతున్నానని కనీసం పెట్టుబడి కూడా చేతికి రాదని అప్పులు పాలైనానని మనస్థాపనతో ఆత్మహత్య చేసుకున్నాడు.