దేశ సరిహద్దు అంశంపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రపాలిత ప్రాంతం లద్ధాఖ్‌లో పొరుగు దేశం చైనా భూమిని ఆక్రమించిందన్నారు. లద్ధాఖ్ ప్రజల్లో ఎవరిని అడిగినా ఈ విషయం చెబుతారని పేర్కొన్నారు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఒక్క అంగుళం భూమి కూడా పోలేదంటున్నారని మండి పడ్డారు. ప్రధాని మోదీ వ్యాఖ్యల్లో నిజం లేదని విమర్శించారు. లద్ధాఖ్‌లో ప్రజలు సంతోషంగా లేరని రాహుల్ చెప్పారు.