పూతలపట్టు మండలం కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం ప్రపంచ దోమల దినోత్సవం కార్యక్రమం జరిగింది. వైద్యాధికారులు వైద్య సిబ్బంది పూతలపట్టులోని పురవీధుల్లో ర్యాలీ నిర్వహిస్తూ, మానవహారం చేపట్టారు. వైద్యాధికారులు మాట్లాడుతూ ప్రతిఒక్కరూ తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ ప్రియాంక, డాక్టర్ ప్రవీణ్ సిహెచ్ఓ శ్రీనివాసుమూర్తి, సిబ్బందులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa