శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పట్టణ పరిధిలో వీరన్నాయుడు కాలనీలో 150వ రోజు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం అట్టహాసంగా ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ హాజరయ్యారు. ముందుగా సంతోషిమాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa