ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడ ప‌ర్యట‌న‌కు బండి సంజయ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 21, 2023, 12:07 PM

బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ నేడు విజయవాడ వెళ్లనున్నారు. న‌గ‌రంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరగనున్న 'ఓటరు చేత్నా మహాభియాన్'లో ఆయన పాల్గొననున్నారు. కార్య‌క్ర‌మంలో భాగంగా రాష్ట్రంలోని బీజేపీ క్యాడర్‌కు పార్టీ కార్యక్రమాల నిర్వహణ, ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ తదితర అంశాలపై బండి దిశానిర్దేశం చేయనున్నారు. ఏపీతోపాటు మహారాష్ట్ర, గోవా, ఒడిశాలో కూడా ఓటరు నమోదు ప్రక్రియను పర్యవేక్షించే బాధ్యతలను బండికి అప్ప‌గించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa