కావేరీ జలాల వివాదంపై ప్రత్యేక బెంచ్: సుప్రీంకోర్టు
national | Suryaa Desk | Published :
Tue, Aug 22, 2023, 08:25 AM
తమిళనాడు, కర్ణాటక మధ్య దశాబ్ధాలుగా కొనసాగుతున్న కావేరీ నదీ జలాల పంపకం వివాదంపై విచారణకు ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేస్తామని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం పేర్కొంది. కావేరీ జలాల వివాదంపై అత్యవసర విచారణ చేపట్టాలని తమిళనాడు తరపు న్యాయవాది ముకుల్ రోహిత్గి ధర్మాసనాన్ని కోరారు. దీనిపై స్పందించిన సర్వోన్నత ధర్మాసనం ఈ మేరకు వెల్లడించింది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com