జగనన్న విద్యాదీవెన పథకం నగదును ఈ నెలలోనే సీఎం జగన్ విడుదల చేయనున్నారు. ఈ నెల 28వ తేదీన చిత్తూరు జిల్లా నగరిలో ఈ పథకం 3వ క్వార్టర్ అమౌంటును బటన్ నొక్కి నేరుగా విద్యార్థుల ఖాతాకు జమ చేస్తారు. ఈ పథకం కింద ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ ఫీజులను ప్రభుత్వం చెల్లిస్తోంది. పర్యటన అనంతరం జరిగే సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు.