బ్రిక్స్ దేశాల సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ నేడు దక్షిణాఫ్రికా రాజధాని జొహాన్నెస్‌బర్గ్ వెళుతున్నారు. 15వ ఈ బ్రిక్స్ సదస్సు మూడు రోజులు కొనసాగుతుంది. ఈ సదస్సులో భారత్‌తోపాటు చైనా కూడా పాల్గొంటుంది. బ్రిక్స్ సదస్సు అనంతరం ‘బ్రిక్స్-ఆఫ్రికా అవుట్రిచ్, బ్రిక్స్ ప్లస్ డైలాగ్’ అనే పేరిట జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. మోదీ అధికారంలోకి వచ్చాక ఈ దేశంలో ఆయన పర్యటించడం ఇది మూడోసారి.