ఏ భాషకు లేని అవధాన ప్రక్రియ తెలుగు భాష స్వంతమని, జాతి మనుగడకు భాషే జీవనాధారమని ఎంఈఓ బాలసుబ్రమణ్యం తెలిపారు. సోమవారం యర్రావారిపాళెం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు శ్రీహరి అధ్యక్షతన తెలుగు పండితులు గండుపల్లి గోవిందయ్య నిర్వహణలో శతావధాని ఆముదాల మురళి అష్టావధానం నిర్వహించారు. కార్యక్రమంలో మన్నవ గంగాధర ప్రసాద్, సతీష్ బాబు, గోవిందయ్య, దేవానందరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.