శ్రీశైల జలాశయం నీటిని సాగు, తాగునీటి అవసరాల కోసం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు దిగువకు విడుదల చేస్తుండటంతో రోజురోజుకు కృష్ణాజలాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో కృష్ణమ్మ నది గర్భంలో నిక్షిప్తమైన సప్తనదుల సంగమేశ్వర ఆలయ శిఖరం మెలమెల్లగా బయటపడుతోంది. సోమవారం సాయంత్రం 6 గంటల సమయానికి శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం 858. 90 అడుగులుగా నమోదైంది. అలాగే జలాశయ నీటి సామర్థ్యం 102. 6485 టీఎంసీలుగా రికార్డయింది.