ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు రక్తం కక్కుకుని చనిపోయాడు. ఈ ఘటన ముంబై నుంచి రాంచీకి బయలుదేరిన విమానంలో సోమవారం సాయంత్రం జరిగింది. సీకేడీ, క్షయతో ఇబ్బంది పడుతున్న 62 ఏళ్ల ప్రయాణికుడు అకస్మాత్తుగా రక్తం కక్కుకున్నాడు. దీంతో పైలట్ విమానాన్ని నాగ్‌పూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. ఎయిర్‌పోర్టు నుంచి బాధితుడిని సమీపంలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు.