భక్తుల లగేజీ విధానంలో కొత్త మార్పులు తీసుకొచ్చింది టీటీడీ. దాతల సహకారంతో సాఫ్ట్వేర్ తయారుచేసి..లగేజీ సెంటర్ కు బాలాజీ బ్యాగేజ్ సెంటర్ గా నామకరణం చేసింది. ఈ సందర్భంగా ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ.. కరోనాకు ముందు కొంత కాలం వరకు కాలిబాట భక్తుల లగేజీని మాన్యువల్ గా ఇచ్చే విధానం ఉండేదని.. ఇప్పటినుంచి కొత్త విధానాల్లో లగేజీ కేంద్రాల్లో టికెట్ స్కాన్ చేయగానే లగేజీ ఎక్కడుందో వివరాలు వచ్చేస్తాయని తెలిపారు.