శ్రీకాకుళం జిల్లా పలాసలో టీడీపీ , వైసీపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో టీడీపీ కి సంభందించిన యువకుడు గాయపడి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నాడు. వివరాల్లోకి వెళ్ళితే... టీడీపీకార్యకర్త రాజశేఖర్, నర్తు ఈశ్వరరావులు సోమవారం సాయిరామ్ మెస్‌లో భోజనం చేస్తూ వచ్చే ఎన్నిల్లో గెలుపు ఓటములపై చర్చించుకుంటున్నారు. ఆ సమయంలో ఎదురుగా కూర్చున్న వైసీపీ కార్యకర్త సాయి.. మీది ఏ గ్రామం? అని ప్రశ్నించాడు. ‘మీకు మా సమాచారం ఎందుకు?’ అని రాజశేఖర్ అనడంతో ఇరువురి మధ్యా వాగ్వాదం జరిగింది. ఈ వ్యవహారంపై కాశీబుగ్గ సీఐ జి.శ్రీనివాసరావు మాట్లాడుతూ... ఇరువురూ ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేశామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa