ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్యను ప్రియుడిని అరెస్ట్ చేసినట్లు నర్సీపట్నం ఏఎస్పి అదిరాజ్ సింగ్ రాణా తెలిపారు. గొలుగొండలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గొలుగొండ మండలం కొత్త మల్లంపేటకి చెందిన గుడివాడ అప్పలనాయుడుకు జానకి అనే మహిళతో వివాహమైంది. జానకికి చింతల రాము అనే ప్రియుడుతో వివాహం కన్నా ముందే పరిచయం ఉంది. భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసి యాక్సిడెంట్ గా చిత్రీకరించినట్లు తెలిపారు.