తమిళనాడు రాజధాని చెన్నైకి దాదాపు 400 కి.మీల దూరంలో ఉంది నమక్కల్. జాబిల్లి అధ్యయనం కోసం ఇస్రో ప్రయోగాల్లో ఇక్కడి మట్టి కీలక పాత్ర పోషించింది. జాబిల్లి ఉపరితలంపై ఉండే మట్టి లాంటిదే ఇక్కడి మట్టి కావడం దీని ప్రత్యేకత. 2012లో తొలిసారి 50 టన్నుల మట్టి సేకరించిన ఇస్రో, 2019లో చంద్రయాన్-2 మిషన్ లోనూ ఇదే మట్టితో ల్యాండర్, రోవర్ బుడిబుడి అడుగులను పరీక్షించారు. చంద్రయాన్-3లోనూ దీన్నే వినియోగించారు.