కళ్యాణదుర్గం విశ్రాంత ఉద్యోగుల భవనంలో బుధవారం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ 12వ వేతన సవరణ కమిటీ ఏర్పాటు సందర్భంగా (ఐఆర్)ని ప్రకటించాలని, దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కరువు భత్యం బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఉపాధ్యాయుడు టి. చెన్నప్ప విశ్రాంత ఉద్యోగుల భవనం మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 21, 116లు విరాళం ప్రకటించారు.