సూర్యుడి గురించి తెలుసుకునేందుకు 'ఆదిత్య ఎల్-1'ని సెప్టెంబర్‌లో ప్రయోగించనున్నట్లు ఇస్రో చీఫ్ సోమనాథ్ వెల్లడించారు. చంద్రయాన్-3 విజయవంతమైన తర్వాత ఇస్రో చేయనున్న ప్రయోగాలను వివరించారు. గగన్ యొక్క అబార్ట్ మిషన్ కూడా అక్టోబర్ మొదటి వారంలో పూర్తి అవుతుంది. రానున్న 24 గంటల్లో చంద్రుడిపై విజ్ఞాన్ రోవర్ ల్యాండ్ అవుతుందని సోమనాథ్ తెలిపారు. శాస్త్రవేత్తల కృషిని కొనియాడుతూ ఇస్రో ఎంతో పటిష్టంగా ఉందన్నారు.