దక్షిణాఫ్రికా జోహెన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా(బ్రిక్స్) దేశాల వార్షిక సదస్సులో బుధవారం ప్రధాని మోదీ ప్రసంగించారు. బ్రిక్స్ కూటమిని విస్తరించాలని, అయితే ఈ విస్తరణ ఏకాభిప్రాయంతో జరగాలని ఆయన పేర్కొన్నారు. అద్భుతమైన భవిష్యత్‌కు బ్రిక్స్ సంసిద్ధంగా ఉండాలంటే మనం మన సమాజాలను భవిష్యత్‌కు సిద్ధం చేయాలని చెప్పారు.